80ఏళ్ల వయసులోనూ అదే స్పీడు..: తాత మాములోడు కాదు..

ఇప్పడున్న వారిలో 30 ఏళ్ల వయసు రాగానే బోన్స్ అరిగిపోతున్నాయని ఓ టీవీ ప్రకటనలో చూస్తున్నాం. వాతావరణంలో కాలుష్యం, తీసుకునే ఆహారంలో కల్తీ ఉండడంతో మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో మనిషి బలహీనంగా మారిపోతున్నాడు. జింక్ ఫుడ్, కాలుష్యంతో లేని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మంచి వాతావణంలో జీవించిన వారు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు వారికి 100 ఏళ్లు దాటినా తమ పనులు తామే చేసుకుంటారు. ఒకరిపై ఆధారపడరు. అయితే అప్పుడు పెళ్లిళ్లు చేసుకున్నవారు ఇప్పటికీ కలిసే ఉంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇలా 50 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఓ జంట ఇటీవల పెళ్లి వేడుక జరుపుకుంది. ఈ సందర్బంగా ఆ తాత వేసిన స్టెప్పులను చూసి షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియా పుణ్యామాని ప్రపంచంలో ఏమూలన జరిగిన విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు 50 ఏళ్ల పెళ్లి వేడుక జరుపుకున్న ఓ జంటకు సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది. పండు ముసలి వయసులో ఉన్నా… ఈ జంట స్ట్రాంగ్ గానే ఉంది. ఇప్పటికీ వారు యాక్టివ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 50 ఏళ్ల పెళ్లి వేడుకలో సాధారణంగా వారి మనువలో.. ఇతరులో డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ మనవళ్లకు పోటీనిచ్చి మరీ ఈ జంట డ్యాన్స్ చేసిందట. ఇక ఆ తాత వేసిన స్టెప్పులకు మనువళ్లు షాక్ అయ్యారట.

మా తాతయ్య ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు.. ఇప్పటికీ తగ్గేదేలే.. అంటూ ఈ వీడియోను పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో తాతపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడున్న యువకులు సైతం తమ పనులు వారు చేసుకోవడం లేదు. కానీ ఈ వయసులో కూడా తాత వేసిన స్టెప్పులు మాములుగా లేవు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ కాలంలో వారు తీసుకున్న ఆహారం వీరు ఇలా ఉండానికి కారణమని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం అప్పటి వాతవారణం బాగుంది అని కామెంట్ పెడుతున్నారు.

ఏదేైమైనా ఈ తాత మళ్లీ పెళ్లి చేసుకొని వేడుకలో జోష్ నింపారు. యువతీవయువకుల్లాగే దండలు మార్చుకున్న వీరు ఆ తరువాత ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఆ తరువాత వీరు తమ జీవితంలో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు. ఇక ఆ తరవాత సంతోషాన్ని ఆపుకోలేక ఓ ఊపున్న సాంగ్ కు బ్రేక్ డ్యాన్స్ చేశారు. మాములు స్టెప్పులు కాకుండా బ్రేక్ డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kavya – Dancer (@kavya_bhaskar)

Leave a Comment