వేడినీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసా..?

బీజీ లైఫ్ గడుపుతున్న నేటి తరుణంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. రోజుకు 12 నుంచి 18 గంటల వరకు పనిచేస్తున్న వారు ఆరోగ్యం గురించి మరిచిపోతున్నారు. దీంతో తక్కువ వయసులోనే అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి పెద్దగా సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. మనం పెద్ద పెద్ద వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. అలాంటి ఓ చిన్న పనిని ప్రతి రోజూ చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దాహం వేస్తే మనం ఎక్కువగా కూల్ గా ఉండే నీరే తాగుతాం. దీని వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది. అయితే రోజూ వేడి నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఉదయం బరిగడుపు గ్లాసుడు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు చెమట ద్వారా బయటకు వెళ్తాయంటున్నారు. వేడి నీరు తాగినప్పుడు శరీరం కాస్త వేడి అవుతుంది. ఆ తరువాత ఒక్కసారిగా కూల్ అవుతుంది. దీంతో బాడీలో ఉన్న మలినాలు బయటకు వస్తాయి.

ఇక వేడి నీరు తాగడం వల్ల నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేస్తాయి. దీంతో మన ఆలోచనలు చురుకుగా ఉంటాయి. బాగా జలుపు చేసినప్పుడు రోజుకు రెండు లేదా మూడు సార్లు వేడినీరు తాగడంతో పాటు ఆ నీళ్లలో జండుబామ్ వేసుకొని ఆవిరిపడితే ఉపశమనం ఉంటుంది. కడుపునొప్పి, జీర్ణ సమస్యలు ఇతరత్రా వ్యాధులకు వేడినీళ్లు తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

అదిక బరువు, ఉబకాయం సమస్యలు కూడా వేడినీళ్లతో అధిగమించవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి అర్ధరైటీస్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. వేడినీళ్లు రక్త ప్రసరణ పెంచడంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. డీ హైడ్రేషన్ సమస్యకు వేడినీళ్లు పరిష్కారం చూపుతాయి. ప్రతి రోజూ స్త్రీలు 2.6 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు చొప్పున నీరు తాగడం మంచిదంటున్నారు. అలాగే వేడి నీళ్లు తాగేటప్పుడు కూర్చొనే తాగాలంటున్నారు.

Leave a Comment