భుజాలపై తల్లి మృతదేహాన్ని మోసుకుంటూ..: ఆ కూతళ్ల కష్టం వెలకట్టలేనిది..

భూమ్మీద జరిగే కొన్ని సంఘటనలు కన్నీరు తెప్పిస్తాయి. అయితే చాలా వరకు మనకు తెలియకుండానే అవి జరుగుతాయి. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతీ విషయం తెలిసిపోతుంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా మన దేశం పల్లెల్లో సరైన వైద్య సౌకర్యాలు కల్పించడంలో మాత్రం వెనుకబడిపోతుంది. ఫలితంగా ఎంతోమందికి సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు విడిచిపెడుతున్నారు. ఇటీవల ఓ మాతృమూర్తి కూడా అలాగే చనిపోయింది. మారుమూల పల్లెలో ఉంటున్న ఆమెకు ఓ వ్యాధి సోకడంతో సరైన సమయంలో వైద్యం అందలేదు. దీంతో ఆమె కూతుళ్లు తల్లిని బతికించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదు. చివరికి ఆమె తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లెందుకు కనీసం ఆంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. దీంతో కూతుళ్లు ఏం చేశారో తెలుసా..?

సాధారణంగా పిల్లలకు జ్వరం వస్తేనే తలిదండ్రులు అల్లాడిపోతుంటారు. కానీ అదే తల్లిదండ్రులు వ్యాధులబారిన పడితే నేటి సమాజంలో కొందరు పట్టించుకోవడం లేదు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు కూతుళ్లు తమ తల్లిని కాపాడుకునేందుకు పడిన కష్టాన్ని చూస్తే కన్నీళ్లు ఆగవు. ఈ రాష్ట్రంలోని రేవా జిల్లా రాయ్పూర్ గ్రామంలో ఓ విషాధ సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని ములియా కీవత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే సమయానికి ఆదుకునేవాళ్లు దగ్గర్లో ఎవరూ లేరు. ఐదు లోమీటర్ల దూరంలో కమ్యూనిటీ హాల్ ఉంది. కానీ అక్కడికి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. కుర్బలియన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఫోన్ చేసిన స్పందన లేదు.

చివరికి ఈ విషయం తెలుసుకున్న ఆమె నలుగురు కూతుళ్లు తమ గ్రామానికి వచ్చారు. అయితే అక్కడ వాహన సౌకర్యాలు లేదు. కనీసం బస్సుకూడా నడవని పరిస్తితి. దీంతో తమకు తెలిసిన వైద్యం చేశారు. అయితే అమ్మ పరిస్థితి విషమంగా మారింది. దీంతో చేసేదేమీ లేక అక్కడున్న మంచాన్ని తిప్పారు. దానిపై అమ్మను పడుకోబెట్టారు. అలా నలుగురు అమ్మాయిలు తల్లిని బతికించుకునేందుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. కానీ దురదృష్టవశాత్తూ వారి తల్లి అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు.

దీంతో ఏడ్చుకుంటూ మళ్లీ తల్లి మృతదేహాన్ని ఆ మంచంపైనే తీసుకొచ్చారు. అక్కడున్న వైద్యులను అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కానీ స్పందన లేదు. కనీసం అక్కడున్న వారు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ నలుగురు అమ్మాయిలో తమ తల్లి మృతదేహాన్ని మంచపైనే తీసుకొచ్చారు. అయితే ఇలా తీసుకొచ్చిన దృశ్యాన్ని మాత్రం కొందరు వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం వద్దకు చేరింది. అప్పుడు ప్రభుత్వం స్పందించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Comment