బయటపడ్డ భారీ సొరంగ నగరం: 20 వేల మంది ఒకేసారి వెళ్లొచ్చు..

కొన్ని దశాబ్దాల కిందట అగ్ని పర్వతాలు బద్దలై శిలలు సహజంగా ఏర్పడ్డాయి. ఈ శిలల కింద అంతకుముందు ప్రజలు నివసించిన నగరాలు కప్పబడ్డాయి. అలా ఓ భారీ నగరం శిలల కిందే ఉండిపోయిది. 1963లో ఓ వ్యక్తి తప్పిపోయిన తన కోడి కోసం వెతుకుతుండగా ఈ నగరం బయటపడింది. ఆయన తన ఇంటిని నిర్మించుకుంటుండగా రోజూ తనకు చెందిన కోళ్లు మాయమయ్యాయి. ఉదయం ఇంటినుంచి వెళ్లి తిరిగి వచ్చేవి కావు. దీంతో ఆయన ఓసారి కోళ్ల వెంట వెళ్లగా ఈ భూగర్భ సొరంగం చూసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఇది హైకింగ్ లేదా హాట్ ఎయిర్ బెలూన్లతో ఇక్కడి వస్తున్న సందర్శకులను ఆకర్షిస్తోంది. అదే టర్కీలోని కపడోషియా ప్రాంతంలోని డెరిన్ కుయు. ప్రపంచంలోనే అతిపెద్ద భూ సొరంగం ఏదంటే డెరిన్ కుయు నే చెబుతారు. ఎందుకంటే ఈ నగరంలో కొన్ని వేల ఏళ్లపాటు జనజీవనం సాగినట్లు ఆనవాళ్లు లభించాయి. ఈ ప్రాంతం ఫ్రిజియన్ ల నుంచి పెర్షియన్లు, బైజంటైన్ యుగంలో క్రైస్తవుల వరకు చేతులు మారుతూ వచ్చింది.

1920లో గ్రీసు దేశానికి టర్కీకి మధ్య జరిగిన యుద్ధంలో కపడోషియా గ్రీకులు ఓడిపోయారు. దీంతో వారంతా మూకుమ్మడిగా ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఈ నగరం ఎప్పుడు నిర్మాణం జరిగిందనేది కచచితంగా తెలియదు. కానీ క్రీస్తూ పూర్వం 370లో ఏథెన్స్ కు చెందిన సెనో ఫోన్ రచించిన అనా బాసిన్ గ్రంథంలో దీని గురించి రాశారు. ఈ పుస్తకంలో ఆయన కపడోషియా చుట్టుపక్కల భూగర్భంలో నివసిస్తున్న అనటొలియన్ ల గురించి కూడా ప్రస్తావించారు. అలాగే క్రీస్తు పూర్వం 1200లో ఫిర్ జియాన్ లనుంచి దాడికి గురైనప్పుడు ఈ ప్రాంతాన్ని తవ్వడం మొదలుపెటట్ి ఉంటారిన మెడిటరేయనియన్ సొరంగాల అంశలో పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో భూమిలో నీరు లేకపోవడంతో ఈ కట్డడం అలాగే ఉండిపోయిందని ఫ్లోరిడా యూనివర్సిటీలోని క్లాసికల్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియా డీ జియోర్ జీ తెలిపారు. ఇనుము యుగంలో అత్యంత నైపుణ్యం ఉన్న అర్కిటెక్ లు విస్తృతమైన భూగర్భ సౌకర్యాలను నిర్మించే సాధనాలు ఉపయోగించి దీనిని నిర్మించారని అంటున్నారు. పశ్చిమ అనటోలియా ప్రాంతంలో రాతి నిర్మాణాల పై భవనాలను రూపొందించి అద్భుతమైన రాతి ద్వారాలను వీరు నిర్మిస్తారు.

బైజాంటెన్ పాలనలో డెరిన్ కు యు జనాభా 20 వేల మంది ఉన్నట్లు అంచనా ఉంది. దీపాల వెలుగులో ఉన్న అర టన్ను బరువున్న గుండ్రని రాళ్లు ఉన్నాయి. బయట నుంచి ఎవరైనా దాడి చేస్తే తెలిసేట్లుగా రాళ్ల మధ్య రంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే భూగర్భంలో నివాసం ఉండడం చాలా దుర్లభంగా ఉండేదని స్థానిక వ్యక్తులు తెలుపుతున్నారు. ఇక్కడుండే మనుషులు కాగడాల వెలుగులోనే కాలం గడిపేవారని అంటున్నారు. అయితే భూగర్భంలో నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన మంచినీటి భావి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ బావి 55 మీటర్ల లోతులో ఉంది.

44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నగరం అనటోలియన్ భూభాగంలో ఉన్న 200 నగరాల్లో పెద్దది. దీనిని చేరుకునేందుకు 9 కిలోమీటర్ల మేర విస్తరించిన సొరంగ మార్గాలున్నాయి. భూగర్భం నుంచిబయటకు వచ్చేందుకు అత్యవసర మార్గాలు కూడా ఉన్నాయి. 2014లో సెవ్ సెహిర్ ప్రాంతంలో మరింత పెద్ద, పటిష్టమైన భూగర్భ నగరంగా పేర్కొన్నారు.

Leave a Comment