ప్రకాష్ రాజ్ అలాంటి పని చేయడం వల్లే తెలుగు ఇండస్ట్రీ 7 సార్లు బ్యాన్ చేసిందా..?

విలక్షణ నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ ఎటువంటి క్యారెక్టర్ నైనా అందులో ఒదిగిపోయి నటిస్తాడు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, రాజకీయవేత్తగా, వ్యాపారవేత్తగా, విలన్ గా, కొన్ని సినిమాల్లో హీరోగా ఇలా ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. ఈయన కన్నడ ఇండస్ట్రీకి చెందిన వారు. వాస్తవానికి చెప్పాలంటే ప్రకాష్ రాజ్ చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో నటించి ఆ తర్వాత తమిళ సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక అలా తమిళ్,తెలుగు, మలయాళం అంటూ అన్ని భాషలలో తన విలక్షణమైన నటనతో అందర్నీ ఆకట్టుకుని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఈయన కేవలం గొప్ప నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాది కూడా. ఈయనకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును చాలావరకు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు సహాయం చేస్తున్నాడు. ఈ విషయం పక్కన పెడితే.. ఈయన ఎప్పుడు వివాదాలకు దగ్గరగానే ఉంటాడు. దానివల్ల కేవలం తెలుగు ఇండస్ట్రీ లోనే ఏడుసార్లు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయబడ్డాడు. ఇక ఇదే విషయం పై ప్రకాష్ రాజ్ ని అడిగితే ఆయన సమాధానమిస్తూ.. ఒక మనిషి తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్తున్నాడు అంటే ఇతరులు ఎవరైనా తనని కించపరచాలనే చూస్తారు.

ఎప్పుడు కూడా తప్పు ఒకరి వైపే ఉండదు. నా దగ్గరికి కథ చెప్పినప్పుడు ఒక విధంగా చెప్పి ఆ తర్వాత షూటింగ్ జరిగేటప్పుడు ఒక విధంగా ఉంటే వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు కచ్చితంగా ఏర్పడతాయి. అంతేకాకుండా నేను మాట మీద ఎక్కువగా నిలబడతాను. దాని వల్లే నాపై చాలా ఆరోపణలు వచ్చాయి. అందుకే నాకు ఒక విషయం అర్థమైంది. నిజాయితీగా ఉండడం, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్లే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని నాకు అర్థమైంది అంటూ ప్రకాష్ రాజు చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ తెలుగు ఇండస్ట్రీ లోనే మొత్తం ఏడు సార్లు బ్యాన్ చేయబడ్డాడు. కానీ ఏడు సార్లు బ్యాన్ చేసినా సరే కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకున్నామని తెలియజేశారు.

Leave a Comment