తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో షాకింగ్ నిజాలు..!

Tarakaratna: ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్య విషయం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు ఇతర భాష ఇండస్ట్రీలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు పలు ట్వీట్స్ కూడా చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అస్వస్థకు గురైన తారకరత్నకు గుండెపోటు అని వైద్యులు నిర్ధారించారు. ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించి అక్కడ మెరుగైన చికిత్స కూడా అందిస్తున్నారు.

ఎప్పటికప్పుడు తారకరత్న  ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బుల్లెట్ జారీ చేస్తున్న నేపథ్యంలో తాజాగా హెల్త్ అప్డేట్ ను వెల్లడించారు వైద్య బృందం. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా సినీ రంగప్రవేశం చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టే క్రమంలో గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఈయనకు చేసిన సిటీ స్కాన్ రిపోర్టులో వైద్యులు పలు కీలక విషయాలు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఆయనకు తక్కువగా ఆక్సిజన్ అందడం వల్లే బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయిందని.. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ రికవరీ పై వైద్య నిపుణులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హాస్పిటల్ లోని ఐసీయూలో తారకరత్న చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి బయటకు లీకవగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే వెంటిలేటర్ పైన తారకరత్నను చూసి అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు.

అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అన్న త్వరగా కోలుకొని తిరిగిరా అన్న అంటూ రకరకాల కామెంట్లు, ట్వీట్స్ చేస్తున్నారు.. ఇప్పటికే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి, నారా కుటుంబ సభ్యులైన బాలయ్య బాబు, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి చేరుకొని.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీస్తున్నారు. ఏదేమైనా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Comment