జాతరలో యువతి మాస్ స్టెప్స్..: వైరల్

అమ్మాయిలు ఒకప్పుడు ఇంటి నుంచి బయటకు రావడానికి చాలా భయపడేవారు. కానీ ఈ రోజుల్లో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో అబ్బాయిలకంటే అమ్మాయిలే ముందుంటున్నారు. సొషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇంట్లో డ్యాన్స్ చేస్తూ దానిని ఫోన్ ద్వారా వీడియో తీసి నెట్టింట్లో పెడుతున్నారు. ఇక పెళ్లిళ్లలో ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే తీన్ మార్ స్టెప్పులు వేసేవారు. కానీ ఇప్పుడు వారిని పక్కకు నెట్టి అమ్మాయిలే ముందు చేస్తున్నారు. ఇలా పెళ్లిళ్లు అనే కాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా డ్యాన్స చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి జాతరలో చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది.

సినిమాల్లో ఫాస్ట్ బీట్ గా ఉన్న సాంగ్స్ కు కొందరు హీరోయిన్లు, నటులు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను ఇన్ స్ట్రాగ్రాంలో పెడుతున్నారు. అలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. వైరల్ కావడమే కాకుండా చాలా మందికి అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సినిమాల్లో నటించేవారే కాకుండా మాములు అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేస్తూ వీడియో తీస్తున్నారు. సినిమా ల పాటలేనే కాకుండా మాస్ సాంగ్స్ కు యువతులు స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఫంక్లన్లలో వీరి కోసం ప్రత్యేకంగా డీజేలు ఏర్పాటు చేయిస్తూ సరదాగా గడుపుతున్నారు.

ఇటీవల ఓ యువతి జాతరలో మాస్ స్టెప్ వేసి అదరగొట్టింది. సాధారణంగా జాతరలో శివసత్తులు, బోనం ఎత్తుకున్నవారు మాత్రమే డ్యాన్స్ చేస్తారు. కానీ ఓ యువతి ప్రత్యేకంగా తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ఓ బోనం ఉత్సవాల్లో పాల్గొన్న యువతి పరికిణిలో డ్యాన్ష్ చేయడం అందరినీ ఆసక్తి గొలిపింది. దీంతో కొందరు తమ మొబైల్ ఫోన్లతో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ మధ్య ఇాలాంటి వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పెళ్లిళ్లు, జాతరలు, ఇతర చిన్న ఫంక్షన్లు వస్తే చాలు.. యువతులు డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. యువతులే కాకుండా పెద్దవారు సైతం చిన్న చిన్న స్టెప్పులు వేస్తుూ సరదాగా గడుపుతున్నారు. ఏదీ ఏమైనా ఒకప్పుడు ఇలా డ్యాన్స్ చేయడానికి భయపడిన వారు ఇప్పుడు మాస్ స్టెప్పులతో ఇరగదీడయం ఆశ్చర్యకరమే.

Leave a Comment