చైతూ కి సమంత మళ్ళీ ఎదురైతే తన మనసులో ఉన్న ఆ మాట చెప్పేస్తాడట..ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉన్న నాగచైతన్య సమంత జంటగా విడిపోయి దాదాపు పది నెలలు అయింది. వాళ్లు విడాకులు తీసుకొని ఇన్ని రోజులు అవుతున్నా వారి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే వారికి ఖచ్చితంగా విడాకులు ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్న ఎదురవుతోంది. నాగచైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

ఈ ఇంటర్వ్యూలో చైతన్య పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు చాలానే ఎదురవుతున్నాయి. అయితే సమంత మీకు మళ్లీ ఎదురుపడితే మీరు ఏం చేస్తారు అనే ప్రశ్న నాగచైతన్య కు ఎదురైంది. దానికి చైతు సమాధానమిస్తూ.. సమంత కనబడగానే హాయ్ చెబుతాను అని అన్నాడు. అంతేకాకుండా నా వ్యక్తిగత జీవితాన్ని నా ప్రొఫెషనల్ జీవితంపై ఎటువంటి ప్రభావం పడకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను అని కూడా చెప్పారు. కానీ నా విషయంలో చాలా మంది పర్సనల్ లైఫ్ కు ప్రొఫెషనల్ లైఫ్ కు జోడించి మాట్లాడుతున్నారు.

కానీ నేను ఎప్పటికి కూడా ఆ రెండింటిని కనెక్ట్ చేయనని నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు. నా వ్యక్తిగత జీవితానికి ప్రొఫెషనల్ జీవితానికి మధ్య తేడాను నేను స్పష్టంగా ఏర్పరుచుకున్నాను. అందుకే ఆ రెండింటినీ ఎప్పుడు కనెక్ట్ చేయనని నాగచైతన్య అన్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన థాంక్యూ సినిమా చైతన్యకు అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది. మరి విడుదలకు సిద్ధంగా ఉన్న లాల్ సింగ్ చద్దా సినిమా ఏ మేరకు సక్సెస్ అందిస్తుందో వేచి చూడాలి.

Leave a Comment