ఈ పిల్లలు చేసిన పనికి దేశం మొత్తం షాక్..

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. కోట్ల మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ వైరస్ ఉన్న వారి జీవితాలతో కూడా ఆడుకుంటోంది. మనదేశంలో దాదాపు ప్రతీ ఇంటిని తట్టిన కొవిడ్ లక్షల ప్రాణాలను మింగింది. ఈ క్రమంలో కొన్ని కుటుంబాల్లో ఇంటి పెద్ద మరణించడంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. మరికొన్ని కుటుంబాల్లో భార్యభర్తలిద్దరి ప్రాణాలు పోవడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. దీంతో తల్లిదండ్రులు చేసిన అప్పులు పిల్లల పాలిట మృత్యు పాశంలా మారాయి. తల్లిదండ్రులను కోల్పోయిన బాధ తీరకముందే అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలను కొందరు అప్పులు కట్టమని వేధించారు. దీంతో ఆ పిల్లలు ఇద్దరు భయపడకుండా ఓ పనిచేశారు. ఏం చేశారో మీరే చదవండి..

భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కిరి జీవితానికి రక్షణగా ఉండేందుకు తమ ఏజెంట్ల ద్వారా పాలసీలు చేయించుకుంది. ఇందులో జితేంద్ర పాటక్ అనే వ్యక్తి పనిచేసేవారు. తన పాలసీ కూడా చేయించుకున్న ఆయన గృహ నిర్మాణం కోసం హోమ్ లోన్ కూడా తీసుకున్నాడు. అయితే కొవిడ్ కారణంగా ఆయతనో పాటు తన భార్య కూడా మరణించారు. దీంతో ఆయన పిల్లలు మనీషా, నివాస్ లు అనాథలుగా మిగిలారు. వీరిలో మనీషా 10వ తరగతి చదువుతోంది. నివాస్ కు 11 సంవత్సరాలు.

వీరి తల్లిదండ్రులు మరణించిన తరువాత ఎల్ ఐసీ ప్రతినిధులు హోమ్ లోన్ కట్టమని వారికి నోటీసులు పంపించారు. హోమ్ లోన్ కట్టాలని లేకపోతే వారి నాన్నగారి పెన్షన్ రాదని నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా వీళ్లకి రావాల్సిన ఎల్ ఐసీ డబ్బులను కూడా ఆపేశారు. దీంతో ఏం చేయాలో తోచక వారు అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో వారు ఏమాత్రం భయపడకుండా వారికి షాక్ తినే సమాధానం ఇచ్చారు.

వారి అమ్మానాన్న ఫొటో పెట్టుకొని ఇలా అన్నారు.. ‘మమ్మల్ని దయచేసి ఇప్పుడే హోమ్ లోన్ డబ్బులు అడగవద్దని.. మాకు 18 సంవత్సరాలు వచ్చిన తరువాత ఉద్యోగం తెచ్చుకొని, లేదా మానాన్న గారు మాకోసం ఇచ్చిన డబ్బులో కొంతవరకు రుణాన్ని ఇస్తాము..’ అని ధీనంగా చెబుతూ ఓ వీడియోను బయటకు పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో పాటు ఈ న్యూస్ ప్రముఖ దినపత్రికలో వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే రంగంలోకి దిగారు. వెంటనే ఎల్ఐసీ వాళ్లతో పాటు మిగతా వాళ్లు కూడా డబ్బులు అడగవద్దని ఆదేశించారు. అలా అడినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వారికి ఇచ్చిన డబ్బులు అడగమని ఎల్ఐసీ ప్రతినిధులతో పాటు ఇతరులు కూడా అధికారికంగ ప్రకటించారు. ఈరోజుల్లో చిన్న చిన్న కష్టానకే హైరానా పడేవాళ్లు.. ఆ పిల్లలను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Comment