అత్తమామల ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసిన కోడలు..: ఎందుకో తెలుసా..?

కాలం మారుతున్న కొద్దీ భార్యభర్తల బంధాలు చెడిపోతున్నాయి. అగ్ని సాక్షిగా ఏడడుగుల నడిచిన దంపతులు కనీసం ఏడు రోజులు కూడా కలిసుండని పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ధూషణల నుంచి ప్రాణాలు తీసేవరకు వెళ్తోంది. ఇలా మూడుముళ్ల కట్టించుకున్న ఓ యువతి భర్తతో కలిసుండలేకపోయింది. ఒకే ఇంట్లో ఉంటున్నా వేర్వేరు గదుల్లో కొనసాగారు. కానీ ఒకరోజు ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో భర్త తన భార్యపై కేసు పెట్టాడు. ఈ క్రమంలో ఆమె ఓ దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా అత్తమామల రహస్య వీడియోలను బయటపెడుతానని బెదరించింది. ఇంతకీ అసలు కథ ఏంటంటే..?

ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార వేత్తకు కొన్ని రోజుల కిందట పెళ్లయింది. కానీ కొన్ని రోజుల తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో రోజూ గొడవలతోనే మాట్లాడుకునేవారు. అలా వీరిద్దరికి పడకపోవడంతో వేర్వేరు గదుల్లోనే ఉండేవారు. అయితే వ్యాపార వేత్త తల్లిదండ్రులు కూడా ఇదే ఇంట్లో వేరే గదిలో ఉంటున్నారు. వీరి గొడవలకు సర్ది చెబుతున్నా వినక ఎవరికి వారే వేర్వేరు గదుల్లో ఉంటున్నారు.

ఈ క్రమంలో వ్యాపార వేత్త భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా శారీరక వ్యవహారాలు కూడా నడిపించింది. ఈ విషయం తెలిసిన అత్తమామలు కోడలిని వారించారు. అయితే తన భర్తకు తెలుస్తుందనే భయంతో ఆ ప్రియుడితో కలిసి కోడలు పారీపోయింది. తనను మోసం చేసి వెళ్లిపోయిందని ఆమె భర్త పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్న సమయంలో ఓ సంచలన వీడియోను బయటపెట్టింది.

ఆ వీడియో ఎవరిదో కాదు.. తన అత్తమామలది. వారిద్దరు బెడ్రూంలో రహస్యంగా ఉన్న సమయంలో వీడియో చిత్రీకరించింది. ఆ వీడియోను తన భర్తకు పంపించింది. కేసు వాపసు తీసుకోకపోతే ఈ వీడియోను బయటపెడుతానని చెప్పింది. దీంతో భర్త మరోసారి పోలీసులకు ఆ విషయంపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారు ఉంటున్న ఇంటికి వెళ్లి పరిశీలించారు. వ్యాపారవేత్త తల్లిదండ్రులు ఉన్న గదిలో సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమెపై మరో కేసు పెట్టి ఆమె కోసం గాలిస్తున్నారు.

Leave a Comment