అమ్మాయిలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే..ఎంతో మంది యువతులు మాన, ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. పదో తరగతి చదువుతున్న విద్యార్థి కి మత్తు ఇచ్చి దారుణంగా రేప్ చేశారు. ఇది నిజంగా భాధాకరం.. గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత మరోకరు రేప్ చేశారు.

వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం ట్యూషన్ వెళ్లింది. ఈ క్రమంలో అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం బాధితురాలిని సాద్‌పుర్‌ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వీరికి తోడయ్యారు. ఆ తర్వాత నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలిక రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టగా.. అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని గుర్తించారు. అనంతరం ఆమెను ఆసుపపత్రికి తరలించి చికిత్స అందించారు. మత్తు నుంచి తేరుకున్న తర్వాత విద్యార్థిని తనపై జరిగిన దారుణం గురించి ఆమె కుటుంబసభ్యులకు వివరించింది. దారుణంగా చెసారని ఆమె చెబుతుంటే అందరి కంట్లో నీళ్ళు వచ్చాయి. ఈ ఘటన పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారొ చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here