తెలంగాణాలో రోజు రోజుకు ప్రేమ జంటల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తాజాగా మరో జంట పెద్దలను ఒప్పించలెక చనిపొయారు. వివరాల్లొకి వెళితే..వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం సిరిపురానికి చెందిన బేగరి శివ, సంగారెడ్డి జిల్లా కోహీర్‌ పట్టణానికి చెందిన బొగ్గుల అమృత దూరపు బంధువులు. శివ సంగారెడ్డిలో బీఫార్మసీ, అక్కడే అమృత మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు చదువుతున్నారు. వీరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలకు చెప్పి.. పెళ్లికి ఒప్పించే ధైర్యం చేయలేక, విడిగా బతకలేక ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఇదే విషయాన్ని సూసైడ్‌ నోట్‌లో రాశారు. ఆదివారం రాత్రి బుధేరాలో జనసంచారం లేని ప్రదేశానికి వెళ్లారు. రాత్రి 8గంటలకు శివ తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పి స్విచ్చాఫ్‌ చేశాడు. ఆపై ఒకే చెట్టుకు ఇద్దరూ ఉరేసుకొని మరణించారు. శివ కుటుంబ సభ్యులు బుధేరా చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలం నుంచి ఆత్మహత్య లేఖ, ఆధార్‌ కార్డులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here