అన్నా తమ్ముళ్లు ఇద్దరూ గొడవ పడ్డారు.. తర్వాత రాత్రి తమ్ముడు అన్నపై కోపంతో అతి దారుణంగా కొట్టి చంపాడు. ఆ ఘటన ను కన్న తల్లి చూస్తూ ఉండి పోయింది.విశాఖ పట్నానికి చెందిన వెంకట శ్రీమన్నారాయణ, వరలక్ష్మి దంపతులు. చాన్నాళ్ల క్రితం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు. వీరికి భరత్ సాయితేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పనిచేసిన శ్రీమన్నారాయణ కొద్దికాలం క్రితం చనిపోయాడు.
వరలక్ష్మి పదేళ్లుగా పక్షవాతంతో మంచాన పడింది. ఇద్దరు కుమారులు జులాయిగా తిరుగుతూ మద్యం మత్తులో తరచూ గొడవ పడేవారు.శుక్రవారం రాత్రి అన్న భరత్ తో ఘర్షణ పడిన తమ్ముడు. వంటింట్లోని కుక్కర్ తీసుకుని బలంగా కొట్టడంతో అన్న అక్కడికక్కడే కిందపడిపోయాడు. తర్వాత మత్తులో ఉన్న తమ్ముడు తల్లి మంచం పక్కనే నేల మీద పడుకుని నిద్రపోయాడు..తర్వాత లేచి చూసి షాక్ అయ్యి పారిపోయారు.. కదల్లెని స్థితిలో ఉన్న తల్లి కొడుకును కూడా చూడలేక పోయింది.అతని డెడ్ బాడీ ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పంపించారు