ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తుంది. అమ్మాయిల పై వరుస లైంగిక దాడులు.. ఇలాంటి ఘటనలు జరగ కుండా ఆపాల్సిన పోలీసులే ఒంటరిగా ఉన్న బాలికపై దాడులు చేస్తున్నారు. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంట్లోకి పిలిచి ఆమెపై అత్యాచారయత్నం చేశాడో హెడ్ కానిస్టేబుల్.వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాల్లో వెలుగు చూసింది.చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

ఓ సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇస్తానని తండ్రితో పాటు బాలికను తన ఇంటికి పిలిపించుకున్నాడు సుధాకర్.బాలిక తండ్రిని సమీపంలోని ఓ షాపుకి పంపించి ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్. బాలిక ఇంటికి వెళ్ళగానే జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో బిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నేరం అంగీకరించాడు. పోక్స్ చట్టం పై కేసు నమోదు చేసుకున్నారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here