మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం ప్రభుత్వం ఎంతగా మొత్తుకున్నా కూడా మందుబాబులు లెక్క చేయరు..పైగా మద్యం రేట్లను తమకు అనుకూలంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా వుండగా మద్యం వినియొగాల్లొ ఆడవాళ్ళదే పై చెయ్యి.. చాలా ప్రాంతంలోని మహిళలు మద్యానికి బానిసలుగా మారి సొంత వారిని,ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డలను దారుణంగా పొట్టన పెట్టుకుంటున్నారు.

ఇప్పుడు అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం తీసుకురాలేదని కన్న బిడ్డను పొట్టన పెట్టుకుంది ఓ కసాయి తల్లి.ముంబై లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లొకి వెళితే..చెంబూర్ ప్రాంతంలో తన కోసం మద్యం తీసుకురాలేదని తన కొడుకును 52 ఏళ్ల మహిళ సుత్తితో కొట్టి చంపినందుకు మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.తన కొడుకు మద్యం తీసుకురాలేదని తల్లి లూర్త్‌ మేరీ కొడుకు ప్రవీణ్‌తో వాగ్వాదానికి దిగింది. గొడవ ఎక్కువ కావడం తో మొదట కొడుకు తల్లిని కొట్టాడు.ఆపై ఆమె అతని తలని సుత్తితో పగులగొట్టింది. ఆ తర్వాత ఆమె ఫ్లాట్‌కు తాళం వేసి పారిపోయింది.. అనుమానం వచ్చిన బంధువులు వచ్చి చూసారు.ప్రవీణ్ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here