ఓ దొంగ చలికి తట్టుకోలేక అతను దొంగలించిన బైక్ కు నిప్పు పెట్టి చలి కాంచుకున్నాడు.. ఇది నిజం. ఇదెక్కడ జరిగిందో ఇప్పుడు ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాము.. మహారాష్ట్రలోనే ఓ పట్టణంలో చాలా బైక్‌లు దొంగతనం చేశాడు. వాటినన్నింటినీ ఓ చోట దాచి పెట్టాడు. ఇప్పుడు అసలే చలికాలం కదా. ఆ దొంగకు బాగా చలివేసింది. అటూ ఇటూ చూస్తే కర్ర ముక్కలాంటివేమీ దగ్గర లో లేవు. దాంతో ఎం చేయాలో తెలియక పక్కనే వున్న బైకును తగలేసాడు.

వివరాల్లొకి వెళితే.. రాష్ట్రంలోని నాగ్ పూర్ లో వెలుగు చూసింది.ప్రతీ రోజు బైక్ లు చోరీ అవుతున్నాయి. తమ బైక్‌లు పోయాయంటూ పోలీసుల వచ్చే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగతనం చేసిన బైకుల గురించి తెలుసుకున్నారు..చలికాలం కావడంతో తనకు బాగా చలివేసిందని చెప్పాడు. చలికాచుకునేందుకు అందుబాటులో ఏమీ లేకపోవడంతో ఓ బైక్ కు నిప్పంటించి చలికాచుకున్నానని చెప్పాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here