హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన కూడా మహిళల పై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.ఇప్పటికీ ఎన్నో దారునాలు వెలుగు లోకి వచ్చాయి.ఎన్నో విధాలుగా మహిళలు లైంగిక వెధింపులకు గురి చేస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది.
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్‌పై హిమాయత్‌సాగర్ వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే తనపై జరిగిన అత్యాచార ఘటన గూర్చి ఇంట్లో ఉన్న తల్లితో బాధితురాలు చెప్పుకుంది.వెంటనే స్టేషన్ కు వెళ్ళి కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చెస్తున్నారు.