ఈ రోజుల్లో అక్రమ సంబంధాల మోజులో పడి చాలా మంది తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు.. తాజాగా గుంటూరులో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తన కుమారుడు అతి దారుణంగా హత్య చేశారు.తాడేపల్లిలో నివసించే ఇందిరకు భర్త చనిపోయాడు.. అయితే, అంజిరెడ్డి కాలనీలో కొడుకు వంశీ వర్ధన్ తో కలిసి ఆమె నివసిస్తోంది. ఇందిరకు కట్ట రాజా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ సహజీవనం చేయటం మొదలెట్టారు.

ఈక్రమంలో గతనెల 26వ తేదీన రాజా అనుమానాస్పద స్ధితిలో మరణించాడు. అనారోగ్యంతో రాజా మరణించాడని చెప్పి ఇందిర అంత్యక్రియలు పూర్తి చేయించింది. కానీ 27వ తేదీ తాడేపల్లి పోలీసులు అనుమానాస్ఫద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.రాజా వంటిపై కత్తిపోట్లు ఉండటంతో పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం రిపోర్టులో రాజా హత్యకు గురైనట్లు తేలింది. దీంతో పోలీసులు రాజా ప్రియురాలు ఇందిర, ఆమె కొడుకు వంశీ వర్ధన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here