మహిళ పై యాసిడ్ పోసి.. దారుణం..

0
39

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలను తీసుకున్నా కూడా వారిపై దాడులు జరుగుతున్నాయి. ఎందరో మహిళలు ప్రాణాలను పోగొట్టుకుంటారు. తాజాగా మరో మహిళ యాసిడ్ దాడికి గురైంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాల మండలంలో ఓ మహిళపై గుర్తు తెలియని దుండగుడు యాసిడ్‌దా దాడి చేశారు.

గురజాల మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చాడు. దాహంగా ఉందని కాస్త మంచినీళ్లు ఇవ్వాలంటూ ఆ ఇంట్లో ఉన్న మహిళను ప్రాధేయపడ్డాడు.దీంతో ఆ మహిళ జాలిపడి ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి అతడికి ఇస్తుండగానే దుండగుడు తన వెంట తీసుకొచ్చిన యాసిడ్‌ను ఆమె శరీరంపై పోసి పారిపోయాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి వద్ద వివరాలు సేకరిస్తున్నారు.. పారిపోయిన వ్యక్థి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Previous articleబంగారు స్వీట్స్ ఎప్పుడైనా తిన్నారా?
Next articleకోకోలా మ్యాగీ..ఎప్పుడైనా తిన్నారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here