సిరికి షాక్ ఇచ్చిన శ్రీహాన్‌..?

0
34

బిగ్ బాస్ సీజన్ 5 గొడవలు పెట్టింది.. దీప్తి సునయన, షణ్ముఖ్ ఈ మధ్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీప్తి సునయన బాటలోనే సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సిరిని దూరం పెడుతూ వస్తున్న శ్రీహాన్‌.. త్వరలోనే ఆమెకు గుడ్‌బై చెప్పనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బిగ్‌బాస్‌ షో పూర్తైనా వీరిద్దరూ జంటగా కనిపించలేదు..ఇది అంతటా అనుమానాలకు దారి తీసింది..

తాజాగా సిరి తో తెగదెంపులు చేసుకునేందుకు శ్రీహాన్‌ సిద్ధమయినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఫోటోలన్నింటిని డిలీట్‌ చేసి షాకిచ్చాడు . కేవలం ఇద్దరూ కలిసి చేసిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ మినహా సిరితో ఉన్న ఫోటోలన్నింటిని శ్రీహాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తుంది.షణ్నూతో కనెక్షన్‌ వస్తుందంటూ సిరి చెప్పిన మాటలతో శ్రీహాన్‌ గుండె బద్దలయ్యిందని, ఎంగేజ్‌మెంట్‌ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి షణ్నూతో చేసిన రొమాన్స్‌ భరించలేక శ్రీహాన్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మరి వీరిద్దరూ నిజంగానే విడిపోతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Previous articleకొడాలి నాని పై ఆర్జీవి కౌంటర్..!
Next articleవార్నీ..పెళ్ళి వద్దని ఆ కుర్రాడు ఎంత పని చేశాడు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here