బిడ్డకు జన్మనిచ్చి తల్లి ఆత్మహత్య.. దారుణం

0
47

తొమ్మిది నెలలు మోసి కనిన ఓ మహిళ విగత జీవిగా మారింది.. మగ పిల్లాడు పుట్టాడు అనే ఆనందం కన్నా తల్లి చనిపోయిందని భాధ ఆ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసింది. తెలంగాణాలో ఈ ఘటన వెలుగు చూసింది.హాస్పిటల్ బాత్రూమ్ లో ఒక బాలింత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది.

విషయానికొస్తె..రొంపికుంటకు చెందిన ఉమ అనే మహిళకు 2009లో వివాహం జరిగింది.డిసెంబర్ 11న ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఆమె మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసిన వైద్యులు 10 రోజులు అక్కడే వుండాలని చెప్పారు.10 రోజులలో వైద్యులు రెండుసార్లు కుట్లు వేసినప్పటికీ ఆ గాయాలు మానడం లేదు. దీంతో సోమవారం మళ్లీ ఆమెకు కుట్లు వేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆ గాయాల బాధ తట్టుకోలేని ఆమె ఆదివారం తెల్లవారుజామున హాస్పిటల్ బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకొంది. ఉదయం బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన సిబ్బంది అక్కడ మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు.. వైద్యుల వల్లే ఆమె చనిపొయిందని కుటుంబ సభ్యులు పోలీస్ కేసు పెట్టారు..పోలీసులు విచారణ చేపట్టారు.

Previous articleనాగార్జునకు హీరోయిన్ కష్టాలు…
Next articleఅన్నను చంపిన తమ్ముడు.. చూస్తూన్న తల్లి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here