మగాడి మాయలో మరో యువతి..చివరికి..

0
30

ఈ రోజుల్లో డేటింగ్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. ఇష్టమైన అబ్బాయి,అమ్మాయి వారికి ఆ పని నచ్చితే చేస్తారు. మ్యాటర్ ఓవర్ అయ్యాక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇదే ఇప్పుడు నయా ట్రెండ్. నచ్చినట్లు వుండొచ్చు.అలాంటి సమయంలో కొన్ని బంధాలు బలంగా మారుతాయి. ఇద్దరికీ ఒకే అనుకుంటే పెళ్ళి చేసుకుంటారు.. ఇలాంటి బంధాలకు ఎక్కువగా అమ్మాయిలు బానిసలు గా మారి జీవితాన్ని  నాశనం చేసుకుంటారు.. ఇప్పుడు అలాంటి ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.

ఇల్లెందు పట్టణానికి చెందిన యువతి, వేంసూరు మండలం కందుకూరుకి చెందిన బండి గౌతమ్‌ లు బీఫార్మసీ కలిసి చదివారు. హైదరాబాద్‌లో ప్రైవేటు జాబు చేస్తున్న ఇద్దరూ మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా కలుసుకున్నారు. భార్యభర్తలని చెప్పి ఏడాదిగా కేపీహెచ్‌బీ అయిదో ఫేజ్‌లో కలిసి ఉంటున్నారు. యువతితో సహజీవనం చేస్తూనే గౌతమ్‌.. మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అతను 16న ఇంటికి వెళ్ళాడు.17 న ఆత్మహత్య చేసుకునెందుకు సిద్ద పడింది.గౌతమ్‌ విషయాన్ని ఇంటి పై అంతస్తులో ఉన్న వారికి చెప్పడంతో వారు వెళ్లి చూడగా అప్పటికే ఉరి వేసుకుని చనిపోయింది.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు..

Previous articleఎందుకయ్యా దేవి..ఇది అవసరమా?
Next articleవామ్మో.. వీరి సెగలు మాములుగా లేవుగా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here