విద్యా బుద్దులు నెర్పాల్సిన మాస్టర్స్ ఇప్పుడు ప్రేమ పాఠాలను నేర్పిస్తున్నారు.ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో లెక్క లెనన్ని వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఘటన పేరెంట్స్ కు ఆందోళన కలిగిస్తుంది.ఈ ఘటన తిరుపతి లో వెలుగు చూసింది. వివరాల్లొకి వెళితే..
తిరుపతి గాంధీ రోడ్డులోని చైతన్య జూనియర్ కళాశాలలో లక్ష్మి ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఎంతో చురుగ్గా చదివే లక్ష్మీ అన్నిటిలోను మంచి మార్కులను సాధిస్తూ వస్తోంది. ఇదే కాలేజీలో కార్తీకేయ ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. తన పని తాను చేయాల్సింది పోయి, అమ్మాయికి ప్రేమ పాఠాలను కూడా నేర్పారు. అలా వారి ప్రేమ చిరుగించింది. గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడు కొనెవాల్లు.. పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా వినేది కాదు..ఆ విషయం పై గొడవ జరిగింది. తర్వాతి రోజు సాయంత్రం ఆమె ఇంటికి రాలేదు. తమ కుమార్తెకేమైందని కంగారుగా కాలేజీకి వెళ్లిన తల్లిదండ్రులకు తోటి విద్యార్థులు చెప్పిన మాటలు విని షాక్ తప్పలేదు.
ఫిజిక్స్ లెక్చరర్ కార్తికేయ ఆమెను తీసుకొని వెళ్లినట్లు చెప్పారు. ఈ విషయం పై యాజన్యాన్ని నిలదీస్తే ఏవో కుంటి సాకులు చెప్పారు.పోలీసులు కూడా కాలెజికి సపోర్ట్ చేశారు.చేసేదిలేక తెలిసిన వారు, బంధువుల సాయంతో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతున్నారు.