కర్నూలులో దారుణం..చిన్నారి పై లైంగిక దాడి..

0
35

ఎన్నో కొత్త చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా కామంధుల లో చలనం లేదు.దిశ లాంటి ఎందరో అమాయికుల ప్రాణాలు పోతున్నా రాక్షసుల మనసు కరగలెదు.. వావి వరుసలు మరచిపోయి మరీ దారునాలకు ఒడిగడుతున్నారు. అత్యంత దారుణంగా చిన్నారుల పై దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కామంధుడు ఆరేళ్ళ చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.

వివరాల్లొకి వెళితే.. ఈ దారుణం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.వెల్దుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. పుల్లగుమ్మి గ్రామంలో ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు.చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అయితే, బాలిక కేకలు విని చుట్టూ పక్క పొలాల వారు రావడంతో బాలిక నోరు మూసి చంపేందుకు ప్రయత్నించాడు. గుంపులో వ్యక్తులు కేకలు వేయడంతో కామాందుడు బాలికను వదిలి పరారయ్యాడు.ఈ విషయం పై కేసు నమోదు కావడం తో పోలీసులు రంగంలోకి దిగారు.. అతణ్ణి వెతికే పనిలో ఉన్నారు.

Previous articleఓ మహిళ.. ముగ్గురు ప్రియులు..చివరికి నిజం తెలిసి..
Next articleకర్నూలు లో పరువు హత్య.. మాట్లాడుదాం అని పిలిచి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here