అక్రమ సంబంధమే ప్రాణాలను తీసిందా? నిజాలెంటంటే?

0
31

అక్రమ సంబంధాలు ఇప్పుడు ఎక్కడ చూసినా పెరిగిపోతున్నాయి..పచ్చని సంసారాలు నాశనం కావడంతో వారి భాగస్వామి దారునాలకు పాల్పడుతున్నారు.. తమ సంసారాన్నీ పాడు చేస్తున్న వారిపై విచక్షణా రహితంగా దాడులు చేస్తూ పోలీసులకు తలపోటులుగా మారుతున్నారు.ఇప్పుడు కూడా ఓ యువకుడు ప్రాణాలను కొల్పొయారు… అతి దారుణంగా వేట కత్తులతో దాడి చేశారు.

వివరాల్లొకి వెళితే..ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చింతగూడెంలో ఈసంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెం దిన కిరాణ వ్యాపారి గజ్జెల రామారావుహత్యకు గురయ్యాడు.బాగా పదునైన ఆయుదాల తో ఈ హత్యను చేశారు.రక్తపుమడుగులో వున్న మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచరాన్ని అందించారు.రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ ను వెతికే పనిలో ఉన్నారు. అదే గ్రామం శివారులోని మాలాయిగూడెంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే ఆమె బంధువులు హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.ఇలాంటి ఘటనలు అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు.

Previous articleకొత్త పాత్రలతో కొత్త ట్విస్ట్.. దీపకు మంచి రోజులు వస్తాయా?
Next articleదారుణం..మద్యం మత్తులో కన్న తల్లే చంపి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here