ఐదుగురితో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు తెలియడంతో..

0
48

భార్య పై చిన్న కోపం వచ్చింది అంటే మగాళ్ల కోరికలకు రెక్కలు వచ్చినట్లే..ఇక్కడ ఓ శృంగార వీరుడు కు భార్య పై కోపం వచ్చింది. దాంతో ఏకంగా ఐదుగురితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఆ వ్యవహారం భార్యకు తెలియడం తో సీన్ రివర్స్ అయ్యింది. ఈ విషయం పై గొడవ కావడం తో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని చనిపొయాడు..

వివరాల్లొకి వెళితే.. ఈ దారుణం కర్నూలు జిల్లా వెల్దురద్ది మండలం గువలకుంట్ల లో వెలుగు చూసింది.
సుధాకర్, బాలలక్ష్మీదేవిలకు సంవత్సరం క్రితమే వివాహం జరిగింది. సుధాకర్ సచివాలయ సంక్షేమ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అందుకే కావాల్సినంత కట్నం ఇచ్చి పెళ్ళి చేశారు..పెళ్ళయిన తరువాత పిల్లలు కలుగలేదు. దీంతో పాటు ఇద్దరి మధ్య మనస్పర్థలు తరచూ వచ్చేవి. దీంతో సుధాకర్ తనకున్న పరిచయాలతో పెళ్ళయి భర్తలను వదిలేసిన మహిళలపై మోజు పెంచుకున్నాడు. అలా వారితో సంబంధం పెట్టుకున్నాడు.

ఆ విషయం భార్యకు తెలియడం తో నిలదీసింది.ఇలా చేయొద్దని ప్రాధేయపడింది. అయినా వినిపించుకోలేదు. తను కూడా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటానని బెదిరించింది. దీంతో మనస్థాపానికి గురయ్యాడు భర్త. ఇంట్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైనది. భార్య పుట్టింటికి వెళ్ళింది. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందెమొ అని ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపొయాడు..

Previous articleభాదలో కార్తీక్.. మోనిత కు పట్టలేని ఆనందం..కట్ చేస్తే..
Next articleదేవుడా..పోలిసే ఇలా చేశాడా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here