వార్నీ..పెళ్ళి వద్దని ఆ కుర్రాడు ఎంత పని చేశాడు?

సాదారణంగా ఒక వయస్సు వచ్చి ఉద్యోగం రాగానే పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. తెలిసిన వాళ్ళకు, పెళ్లిళ్ల పేరయ్య లకు చెప్పి మంచి అమ్మాయిని చూడమని చెబుతారు..మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల వరకు ప్రతిదీ వెతికేస్తారు. తమ నచ్చిన అమ్మాయి/అబ్బాయిల ఫొటోలు చూపిస్తూ చిత్ర హింసలు పెడతారు. కనీసం పదికి తగ్గకుండా పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేస్తారు..  పెద్దలు హింసలు పెట్టి మనసును పాడు చేస్తారని ఓ యువకుడు వినూత్న ఆలోచన చేశాడు.అరేంజ్డ్ మ్యారెజ్’ వద్దంటూ సరికొత్త ప్రచారంతో ఆకట్టుకుంటున్నాడు.యూకేలో నివసిస్తున్న 29 ఏళ్ల మహమ్మద్ మాలిక్‌ పేరు.. బర్మింగ్‌హమ్‌లో మారుమోగుతుంది.

కేవలం అక్కడ మాత్రమే కాదు.. సోషల్ మీడియా దయవల్ల ప్రపంచమంతా అతడి గురించే మాట్లాడుకుంది. ఇందుకు కారణం.. అతడు ఆ నగరంలోని ఓ ప్రధాన కూడలిలో పెట్టిన ఓ భారీ హోర్డింగే. ”అరేంజ్డ్ మ్యారేజ్ నుంచి నన్ను రక్షించండి” అంటూ అతడు తన ఫొటోతో.. లింక్ కూడా పోస్ట్ చేశాడు. వెబ్ సైట్ లో ఏముంది అని ఓపెన్ చూసిన వారికి భారీ షాక్ ఇచ్చారు. నా ఫేస్‌ను మీరు తప్పకుండా ఏదైనా బిల్‌బోర్డ్ మీద చూసి ఉంటారు. నా వయస్సు 29. నేను లా విదా లండన్‌లో ఉంటున్నా. నేను పారిశ్రామికవేత్తను. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అంటూ సోషల్ మీడియాలొ పోస్ట్ చేసాడు.అది కాస్త వైరల్ అవుతుంది..

Leave a Comment