క్లాస్ రూంలోనే పనిగానించిన విద్యార్థులు: యాజమాన్యం సీరియస్

భవిష్యత్ బాగుండాలని ఆలయం లాంటి చదువుల బడికి వెళ్తాం. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఈ క్రమంలో కొందరు విద్యార్థులకు ఎంత మంచి బుద్దులు బోధించినా తలకెక్కదు. చేయరాని తప్పులు చేస్తూ అటు విద్యాసంస్థలకు, ఇటు తల్లిదండ్రులకు తలవంపులు తెస్తారు. అస్సాంలోని ఓ పాఠశాలలో కొందరు విద్యార్థులు చేసిన పనికి ఇప్పుడు అదే జరిగింది. వారి పిచ్చి చేష్టల వల్ల కళాశాల యాజమాన్యం తలదించుకోవాల్సి వచ్చింది. అటు తల్లిదండ్రులూ తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది. అసలు ఏం జరిగిందంటే..?

అస్సాం రాష్ట్రంలోని సిల్సార్ లోని రామానుజ్ గుప్తా అనే కళాశాలకు చెందిన ఓ వీడియో లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఏడుగురు విద్యార్థులు పాడు పనులు చేస్తూ దొరికిపోయారు. నలుగులు అమ్మాయిలు, మిగతా అబ్బాయిలు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇలా వీరు చేస్తున్న పని మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే ఈ విషయం కళాశాల కరస్పాండెంట్ వద్దకు చేరడంతో వెంటనే యాక్షన్ తీసుకున్నారు. సదరు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పూర్ణదీప్ చందా మట్లాడారు. ‘కొందరు విద్యార్థులు మాకు తలవంపులు తెచ్చే పని చేశారు. కళాశాల క్లాస్ రూంలో ఎవరూ లేని సమయంలో దుర్మార్గపు ఆలోచనలతో పాడు పనులు చేశారు. మా కళాశాలలో మొబైల్ ఫోన్లను ఇప్పటికే నిషేధించామని, అయినా కొందరు ఇలాంటి పనులు చేయడం శోచనీయమన్నారు. 11వ తరగతికి చెందిన బ్యాచ్ విద్యార్థులే ఈ పని చేశారు. వారిని వెంటనే సస్పెండ్ చేశాం’ అని అన్నారు.

https://youtu.be/KbkfeuiUhQ4

అయితే ఇంతటితో కళాశాల యాజమాన్యం ఆగలేదు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి చర్చించారు. వారు తమ బిడ్డలకు మరొక అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ విద్యార్థుల పట్ల యాజమాన్యం కఠినంగానే ఉంది. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Leave a Comment